గురు. జూలై 18th, 2024

సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా

TEJA NEWS

సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్, డా,, మౌటం కుమారస్వామి ఎన్నిక
…..
కమలాపూర్ మండల కేంద్రం లో జరిగిన మిత్రమండలి పరస్పర పరపతి సహకార సంఘ సమావేశం లో పార్టీలకు అతీతంగా ఆ సంఘ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా గుండారపు చరణ్ పటేల్ ప్రధాన కార్యదర్శిగా డా,, మౌటం కుమారస్వామి ఉపాధ్యక్షునిగా బొల్లం రాజిరెడ్డి కార్యదర్శి గా దూడ శ్రీకాంత్ కోశాధికారి గా విద్యా సాగర్ ఎన్నికైన్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు చరణ్ పటేల్ మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు అనే సహకార సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని సభ్యుల కష్ట నష్టాలో ఒకరికి ఒకరు తోడు ఉండాలని పేర్కొన్నారు. మాజి సర్పంచ్ మాట్ల రవీందర్ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామజికంగా ఆర్థికంగా సహకారం ఆందిపుచ్చుకోవటమే ఈ సంఘ ఏర్పాటు ఉదేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సభ్యులు మాట్ల రవీందర్ దర్ముల సదానందం వొళ్ళాల శ్రీనివాస్ గొట్టె రవి నారాయణ రెడ్డి కొండపాక మనీష్ పాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page