చంద్రబాబుకు ఎలాంటి విలువలూ లేవు: వైఎస్ జగన్
- న్యాయం, ధర్మం పాటించని వ్యక్తి అందుకే మెజార్టీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ
- నర్సీపట్నం, పెందుర్తి పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్
- తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.. అలాంటి దుర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం.
- మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు.
- మనం చేయగలిగిందే చెప్పాం.. చేసి చూపించాం
- మన బలం ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతే
- బొత్సను గెలిపించి మన పార్టీ ప్రతిప్పును మరింత పెంచేందుకు సహకరించండి.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ వ్యక్తికి ధర్మం, న్యాయం అనే పదాలకు అర్ధం తెలిసి ఉండాలి. ఆ స్థాయి వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. కానీ చంద్రబాబునాయుడికి న్యాయం, ధర్మం ఏవీ లేవు. దురదృష్టవశాత్తు మనం ఈ దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం. తన స్వార్ధం కోసం ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.
అధికార, ధనబలంతో చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రతి పనీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సినది కాదు. నాయకుడు అనేవాడు ఇంత అధ్వానంగా ఉంటాడా.. అన్న స్థాయిలో ఆయన పని చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం.
కష్టకాలంలో తోడుగా నిలబడ్డ ప్రతికార్యకర్తకు కచ్చితమైన గుర్తింపు వస్తుంది. నేను కోరేది ఒక్కటే. ప్రజలకు మనం దగ్గరగా, తోడుగా ఉంటే వారే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రజలే దండలు వేసి మనల్ని పిలిచే రోజు వస్తుంది.
-వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్