వరద బాధితుల సహాయ నిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ” 10 లక్షలు వితరణ.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెక్ అందజేసిన కె.సాంబశివరావు.
పరవాడ: వరద బాధితుల సహాయనిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం రూ “10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. రూ “10 లక్షల రూపాయల చెక్కులను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి. మల్లారెడ్డి తరపున వైస్ ప్రెసిడెంట్ కె . సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వయంగా కలిసి అందజేశారు.తుఫాను విపత్తుకి విజయవాడ, పరిసర ప్రాంతాలు జలమయం అవ్వడమే కాకుండా తీవ్ర పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ల పిలుపుమేరకు వరద బాధితుల సహాయ నిధికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని కంపెనీ యాజమాన్యం పేర్కొన్నారు. విపత్తు నుండి విజయవాడ పరిసర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని యధాస్థితికి రావాలని యాజమాన్య ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వరద బాధితుల సహాయార్థం కెమిక డ్రగ్స్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె. సాంబశివరావు తో పాటు కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వరద బాధితుల సహాయ నిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ” 10 లక్షలు వితరణ.
Related Posts
జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.
TEJA NEWS జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.కమిషనర్ ఎన్.మౌర్య జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్, ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాద్యాయ నగర్ లోనికి వస్తున్నాయని ప్రజా ఫిర్యాదుల…
మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
TEJA NEWS మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.కమిషనర్ ఎన్.మౌర్య నగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రెయినేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఉదయం 14 వ డివిజన్ లోని ఎమ్మార్…