నగరంలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ:
నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లీలామహల్ కూడలి సమీపంలో మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. అరగంట లోపు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా హాజరు నమోదు చేసి విధులకు వెల్లెలాచూడాలని, అంతకంటే ఎక్కువ సమయం లేటుగా వస్తె గైర్హాజరు అయినట్లు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తిమ్మినాయుడు పాలెం సమీపంలో ప్రజల కొరకు నూతనంగా పార్కు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేసారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత కమిషనర్ బంగ్లా, పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించనున్న ర్యాలీ కొరకు ఎస్వీయూ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డెప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, ఏసిపి బాల సుబ్రమణ్యం, తదితరులు ఉన్నారు.