TEJA NEWS

అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది

-మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం,
స్పిల్ వే పూర్తి చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న అనాలోచితం నిర్ణయాల వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం, శుభోదయం, న్యూస్: 2016లో వరద మళ్లింపు కోసం స్పిల్ వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే డయాఫ్రం వల్ల దెబ్బతినిందని అంతర్జాతీయ నిపుణులు కమిటీ బృందం తేల్చిందన్నారు. డయా ఫ్రమ్ వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసిందన్నారు. ప్రధాన డ్యామ్ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా, 2020లో మాజీ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మూడు అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం పనులు ఒకేసారి చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. ఢిల్లీలో వైయస్ జగన్ ధర్నా చేశారని, అనంతరం మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయని అన్నారు. పోలవరం వాస్తవాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన వెంటనే ధవళేశ్వరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయాయన్నారు. ఇప్పటికే వైఫల్యం చెందిన ప్రభుత్వం కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకున్న మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు కేంద్రంతో అలయన్స్లో ఉన్నారని, కొట్లాది రూపాయలు కేంద్రం నుంచి తీసుకొస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.


ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని ఈ ప్రభుత్వం నడుస్తోందని, ఈ పద్దతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారో వాటిని అధికారంలోకి వచ్చి ఒకటి కూడా నెరవేర్చటం లేదన్నారు. ప్రజలను మోసం చేయటానికి ప్రభుత్వం పేద అరుపులు అరుస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోందన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తి అయితే వస్తుందని ఆశించామన్నారు. బిజెపి, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడదీసేది సమయంలో పదేళ్లు ప్రత్యేక హెూదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2016 మే 2న పోలవరం పనులు ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రమే చేపడుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరి స్టేటస్ కు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారని, చంద్రబాబు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంలో అడ్రస్తోపాటు పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ గురించి కూడా ఆలోచించాలన్నారు. కాపర్ డ్యామ్ చేపట్టే నాటికే స్పిల్ వే పూర్తయి ఉండాలన్నారు. కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోడీ నేరుగా ఆరోపించారని అన్నారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచితం నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం భారీగా ప్రజాధనాన్ని నష్టపోయిందన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, స్పిల్ వే పూర్తి చేయకుండా చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెల్లుబోయిన వేణు ఆరోపించారు.


TEJA NEWS