TEJA NEWS

స్మార్ట్ కిడ్జ్ లో ఎకో ఫ్రెండ్లీ గణనాధులు తయారీ.
చిట్టి చేతులతో పెద్ద సందేశం.


ఉమ్మడి ఖమ్మం

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పర్యావరణహితంగా గణనాథులను పాఠశాల చిన్నారులు తయారు చేశారు. ఎకో ఫ్రెండ్లీ గణపయ్యాలనే పూజించాలని చాటి చెబుతూ పాఠశాల చిన్నారులు వివిధ ఆకృతులలో గణపయ్యలను తమ చిట్టి చేతులతో తయారు చేశారు. మట్టితో వివిధ ఆకృతులలో గణేష్ మహారాజును తయారు చేయడంతో పాటు ఆకులతో , కూరగాయలతో , పసుపు ముద్దలతో, పిండితో, రకరకాల కూరగాయలతో గణనాధులను తయారు చేశారు. చిట్టి చేతులతో పెద్ద సందేశాన్ని లోకానికి చాటి చెప్పడానికి పాఠశాల చిన్నారులు వివిధ రూపాలలో రూపొందించిన గణనాధుల ప్రతిమలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరుతూ తమ పాఠశాల చిన్నారులు పర్యావరణహిత గణనాధులకు రూపకల్పన చేశారని తెలిపారు. గణేష్ ఉత్సవాలలో , గణేష్ నిమజ్జన వేడుకలలో పర్యావరణహితంగా ప్రజలు పూజలు నిర్వహించాలని కోరారు. ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ఎంతటి విధ్వంసమైనా కలుగుతుందని ప్రస్తుత సంఘటనలు రుజువు చేస్తున్నాయని అందుకే ప్రకృతిని కాపాడాలని, ప్రకృతిని రక్షిస్తేనే ప్రకృతి మనలను రక్షిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS