TEJA NEWS

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి

-సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ డిమాండ్

అకాల వర్షాల కారణంగా వరదలతో ఖమ్మం నగరం లో నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సోమవారం నాడు మాస్ లైన్ పార్టీ ప్రతినిధి బృందం బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, రాజీవ స్వగృహ తదితరుల ప్రాంతాలలో సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముందస్తు ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ప్రభుత్వం తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఎక్కువ ఆస్తి నష్టం జరిగిందని ఆయన అన్నారు. బోట్లు హెలిక్యాప్టర్ తదితరులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కువ సేపు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆయన గుర్తు చేశారు ,భోక్కల గడ్డ సుందరయ్య నగర్ పంపింగ్వేల్ రోడ్డు రాజవ్ స్వగృహ ఏరియాలో నివసిస్తున్న పేదల కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలకుండా కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఇండ్లు బజార్లో బురదలమయం అయ్యాయని తాగునీరు ఇండ్లు
శుబ్రం చేసుకోవడానికి నీరు, భోజనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ముంపు ప్రాంతాల్లో కనీస వస్తువులు కల్పించాలని ఆయన కోరారు ముంపుకు గురైన ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని అని డిమాండ్ ముంపు ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న బురదను తొలగించేందుకు కార్పొరేషన్ చర్యలు ముమ్మరం ఇంకా చేపట్టాలన్నారు ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం చేయాలని కోరారు. ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ ఆటోలు పిల్లల పుస్తకాలు సర్టిఫికెట్ల సైతం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు తిరిగి పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రవేట్ రుణాల emi లును కూడా వాయిదా వేయించాలని ఆయన సందర్భంగా కోరారు. ఖమ్మం నగరానికి వరద ముప్పు లేకుండా శాశ్విత పరిష్కారం కనుగొనలని ఖమ్మం నగరం అంతట అండర్ గ్రౌండ్ డ్రైనేజీని త్వర త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కకపోయిన తొమ్మిది మందిని కాపాడటం కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:00 వరకు టైం పట్టిందంటే జిల్లా మంత్రుల పనితీరు కు ఇదొక నిదర్శనం అని ఆయన విమర్శించారు ఇప్పటికైనా అన్ని రకాల చర్యలు చేపట్టి త్వరగా నగరాన్ని క్లీన్ చేసి విష జ్వరాలు పగలకుండా జాగ్రత్తలు తీసుకుని బాధ్యతలు ఆదుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామయ్య సివైపుల్లయ్య ఆవుల అశోక్ నాయకులు కే శ్రీను సురేష్ సత్తార్ వెంకటేష్ శ్రీను ప్రసాదు వెంకటేష్ పండు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS