గురు. జూలై 18th, 2024

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం

TEJA NEWS

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు

డిబేట్ జిల్లా :

మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు మరియు కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందవచ్చు అనే అంశాల గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో,షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్, సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల మాటలు విద్యార్థు నమ్మవద్దు అని అన్నారు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని,మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అని,మహిళల భద్రత మా ముఖ్య బాద్యత అని మాట్లాడారు.చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అని విద్యార్థులతో ముచ్చటించి,చెడు అలవాట్లకు బానిస అయితే జీవితం ఎలా ఉంటుందో అని విద్యార్థులకు జాగ్రత్తలు చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని, పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు -ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డి, మర్కుక్ పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page