TEJA NEWS

సెప్టెంబర్ 9న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ నరసింహ వనపర్తి పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు సూచించిన………ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి :

  సెప్టెంబర్ 9న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా వనపర్తి జిల్లా వైద్య ఆసుపత్రి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని  స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు. 
    జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మర్రికుంట వద్ద నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలను సందర్శించారు. 
  ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ 9వ తేదీన వనపర్తి జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించి వైద్య కళాశాల పక్కనే  602  పడకల ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు భవన నిర్మాణం జరిగేచోట స్థలం చదును చేసి శిలాఫలకం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, కళాశాల భవన గుత్తేదారుకు  సూచించారు. 
   అంతకుముందు వైద్య కళాశాల పనుల పురోగతిపై సమీక్షించారు.  వైద్య కళాశాల నిర్మాణానికి నిధుల కొరత లేదని ఇటీవలే పెండింగ్ బిల్లు మొత్తం చెల్లించడం జరిగినందున త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. భావనం పూర్తి చేసేందుకు కాల గడువు విధించుకొని రోజుకు ఎంతపని చేయాలి ఎంత చేశారు అనేది నివేదిక  రూపొందించి కలక్టర్ కు  తనకు పంపించాలని ఆదేశించారు.
  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ తరగతి గదుల తో పాటు  బాలుర, బాలికల వసతి గృహాలు డిసెంబర్ వరకు పూర్తి చేసి ఇవ్వాలని, అందుకు లేబర్ సంఖ్యను మరింత పెంచాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడ మొత్తం పూర్తి చేసి గేట్లు అమర్చాలని ఆదేశించారు. రోడ్లు భవనాల  శాఖ ఇంజనీర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తూ పనిలో వేగంతో పాటు నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు.
   రోడ్లు భవనాల డి. ఈ. సీతారామ స్వామి, తహసిల్దార్ చాంద్ పాషా, ఏ. ఈ, గుత్తేదారు తదితరులు ఉన్నారు.

TEJA NEWS