TEJA NEWS

నారాయణ ఇ-టెక్నో పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ సెర్మని వేడుకలు

రాజమహేంద్రవరం : నారాయణ ఇ-టెక్నో పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ.జి.ఎమ్. ఎన్. శ్రీనివాసరెడ్డి (రాజమండ్రి డివిజన్) జోనల్ కోఆర్డినేటర్స్, ఆర్.అండ్ డి. హెడ్స్, ఆర్.ఐ. షేక్ అలీషా, క్లస్టర్ ప్రిన్సిపాల్ ఏ.నీరజా రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఏస్.విజయలక్ష్మి ప్రిన్సిపాల్ సునీత సాగర్ మరియు సాఫ్ట్ స్కిల్స్ హెడ్ డి.రాధాకృష్ణ పాల్గొని స్టూడెంట్ క్యాబినేట్ ఎన్నికల ఫలితాల వేడుకను జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులను అతిథులు బ్యాడ్జీలతో సత్కరించారు. ముఖ్య అతిథి ఎన్. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుండే నాయకత్వ నైపుణ్యాలతో సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దేలా బాధ్యతాయుతంగా విద్యార్థులు ముందడుగు వేయాలని, నేటి బాలలే రేపటి పౌరులని తెలియజేశారు. ఆర్.ఐ. షేక్ అలీషా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మాట్లాడారు. అతిథులను సత్కరించు కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్, కో-ప్రిన్సిపాల్స్, అకాడమిక్ డీన్ బి.వీరేంద్ర, వైస్ ప్రిన్సిపల్స్ డి.దీప్తి, డి.రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ దివ్య వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


TEJA NEWS