TEJA NEWS

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు

రాజమహేంద్రవరం :
కళలకు.. కులం లేదు, పార్టీలేదు, మతం లేదు.. అంతా అభిమానమేనని చిరంజీవి అభిమానులు రుజువు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఆగష్టు 22 వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని సామాజిక సేవకుడు, చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాసు ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు, తెదేపా రాష్ట్ర నాయకులు యర్రా వేణుగోపాల్ రాయుడు, జనసేన నాయకులు వై.శ్రీనివాస్, బిజెపి నాయకులు బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, వ్యాపారవేత్త నామాని వాసు పాల్గొన్నారు.కేకు కటింగ్ అనంతరం పర్యావరణ పరిరక్షణ కోరుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణీ, గొడుగులు వితరణ, వికలాంగులకు వీల్ చైర్లు, హియరింగ్ మిషన్ లు పంపిణీ చేశారు. వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత ఐదు రోజులుగా మూగ జీవాలకు ఆహారం వేయడం, అన్నార్తులకు ఆహార పొట్లాలు పంపిణీ, గోదావరి రేవుల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించినట్టు కార్యక్రమ నిర్వాహకులు పడాల శ్రీనివాసు తెలిపారు. కార్యక్రమంలో సబ్బెల్ల వెంకటరావు, రమేష్, పడాల వెంకటేష్, వేమగిరి నుంచి ప్రకాష్ లైటింగ్ నాగేశ్వరరావు, దేసినీడి రాంబాబు, హరి, లాయర్ సునీల్, స్వతంత్ర ఆటోస్టాండ్ అధ్యక్షులు అచ్చిరెడ్డి వాసు, అల్లాటి రాజు, ఆసూరి సుధాకర్, పడాల యశోదా కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ యువత, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


TEJA NEWS