TEJA NEWS

జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలితో ఐఎన్టియుసి (ఎఫ్)…
మహిళా కార్మికులను కాంగ్రెస్ విభాగంలోకి తీసుకోవాలి…!*
కాంగ్రెస్ అభ్యున్నత్తికై మహిళా ఐఎన్టియుసి(ఎఫ్) కృషి…ప్రభుత్వ పథకాలపై గ్రామ స్థాయిలోకి ఐఎన్టియుసి(ఎఫ్)… తెలంగాణలో కాంగ్రెస్ మహిళా కమిటీలు వేయాలి…! సానుకూలంగా స్పందించిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్క లాంబ..

వనపర్తి :

ఢిల్లీ లో ఏఐసిసి కాంగ్రెస్ మహిళా కార్యాలయంలో అధ్యక్షురాలు ఆల్క లాంబను ఐఎన్టియుసి (ఎఫ్)జాతీయఅధ్యక్షులు శ్రీ స్వామినాద్ జైస్వాల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురహరి బుద్దారం మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్బంగా మహిళా కార్మికులకు సంబందించిన పలు అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో మహిళా కాంగ్రెస్ ను మరింత భలోపేతం చేసేందుకు కార్మిక మహిళలను సైతం కాంగ్రెస్ మహిళా విభాగంలోకి తీసుకోవాలని అప్పుడే గ్రామ స్థాయిలో మహిళలు పెద్ద ఎత్తున పార్టీని మహిళా శక్తిని భలోపేతం చేసే అవకాశం ఉందని కావున తెలంగాణ రాష్ట్రములో నాయకత్వ లక్షణం కలిగిన మహిళలు వందల సంఖ్యలో ఉన్నారని కావున ప్రతి జిల్లాలో మహిళా కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మహిళా అధ్యక్షురాలు ఆల్క లంబ తదుపరి రానున్న కార్యాచరణలో పెద్ద ఎత్తున కృషి చేస్తామని అన్నారు.
మహిళా కార్మికులను సైతం కాంగ్రెస్ విభాగంలోకి తీసుకొని కాంగ్రెస్ అభ్యున్నత్తికై మహిళా ఐఎన్టియుసి(ఎఫ్) సేవలను సైతం వినియోగించుకుంటామని ప్రభుత్వ పథకాలపై గ్రామ స్థాయిలోకి తీసుకొని వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురహరి బుద్దారం, జాతీయ కార్యదర్శి సాయిబాబ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరింగ్ శ్రీనివాసులు, రాజు జీర్లపల్లి, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఎడ్ల మధుసూదన్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అలకుంట్ల బాలకృష్ణ, రంగా రెడ్డి అధ్యక్షులు ఎంగలి ప్రసాద్, నాజా ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS