TEJA NEWS

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, వరంగల్ లోని , జగిత్యాల సర్కిల్ పరిధిలో బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తోడు సెప్టెంబర్ 4 నుండి 9 వరకు వాతావరణ శాఖ భారీవర్షాలు ఉంటాయని అంచనా ల నేపథ్యంలో, వినియోగదారులు విద్యుత్ పట్ల జాగ్రత్త గా ఉండాలని,

ఈ. సాలియా నాయక్ , సూపరింటెండింగ్ ఇంజనీర్, జగిత్యాల తెలిపారు.

వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరును మరియు స్తంభాలను , తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు.
తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు మరియు గమనించిన వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
బట్టలు ఆరవేసే జి.ఐ దండెము వైర్ల పై నుండి విద్యుత్ వైర్లు వెల్లడం వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని కోరారు .
అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. కనుక విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెం లకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. .
ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున, కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు. వ్యవ సాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ఎర్తింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు .
రైతులు, వినియోగదారులు స్వయంగా తమ సొంత కరెంట్ పనులను చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారని, చాల బాధాకరమని , అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ తో పనులు చేసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • చాల యాజమానులు పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు , స్థంబాలు దగ్గరికి వెళ్లకుండా కాపరి వాళ్ళు జాగ్రత్త వహించాలని కోరారు .
    *ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి మరియు నాణ్యమైన ప్లగ్గులు మరియు సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించండి.
  • ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
    మోటారు రిపేరు తెలిసిన వారిచేతనే రిపేర్లు చేయించండి.
  • వ్యవసాయ మోటార్లకు మరియు గృహాలలో అతుకులు (joints ) లేని సర్వీసు వైరును మాత్రమే ఉప యోగించండి.
  • సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడం వలన షాక్ కు గురై చనిపోతున్నారు. దయచేసి చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరడమైనది.
  • ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
    వినియోగదారుల గృహాలలోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల , నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన, రైతులు స్విచ్ బోర్డు/మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించక పోవడం వలన విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని అన్నారు .

గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇంజనీర్ , సెక్షన్ ఆఫీసర్ ను సంప్రదించి వారి సేవలను పొందండి. మీ నెలవారీ కరెంట్ బిల్లులో ముద్రించిన ఏఈ ఫోన్ నెంబర్ ముద్రించి ఉంటుంది . ఆ నెంబర్ ను సంప్రదించి సేవలు పొందవచ్చు.
విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912, 18004250028 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు .


TEJA NEWS