గురు. జూలై 18th, 2024

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

TEJA NEWS

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి యం.హృదయ రాజు మరియు జిల్లా సూపర్ ఇన్ డెంట్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ ముఖ్య అతిధిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రితిరాజ్ ఐపీఎస్ మాట్లాడుతూ… విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అడ్డంకులను అధిగమిస్తూ తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగా అడుగులు వేయాలని సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని అందుకు తల్లిదండ్రులు మీకు ప్రధాన పాత్ర గా ప్రోత్సహిస్తారని అధ్యాపకులు సహాయంతో మీ జీవిత లక్ష్యాలు చేరుకోవాలని తర్వాతే స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా అమ్మాయిలకు చదివే ముఖ్యమని అదే మిమ్మల్ని తల ఎత్తుకొని జీవించేలా చేస్తుందని విద్యార్థిని చక్కగా చదువుకొని ఉద్యోగాలు సాధించిన తర్వాత వివాహాలు చేసుకోవాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీరన్న సార్ బాలకృష్ణ, శిరీష బోరవెల్లి పవన్ కుమార్, శేఖర్, శేఖర్,కలీముల్లా,గీతా, అనూష సుతారి గోపి ఎస్. నరసింహులు ఎస్. వెంకటేష్, కృష్ణ పరమేష్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

You cannot copy content of this page