TEJA NEWS

వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన పనులు బయటపడతాయి
రావులపల్లి రోడ్డు, ఫతేపూర్ బ్రిడ్జి రోడ్డును పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపిస్తా

శంకర్‌పల్లి: వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు బయటపడతాయని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి ఫతేపూర్ బ్రిడ్జి పక్కన గల రోడ్డు పనులను, రావులపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును, మోకిలలోని లా పలోమా విల్లాస్ లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్ల మరమ్మతుల గురించి ఆర్ అండ్ బి అధికారులతో ఎంపీ ఫోన్ లో మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ రావులపల్లి గ్రామ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఫతేపూర్ బ్రిడ్జి పక్కన రోడ్డు పనులను వేగవంతం చేయాలని రోడ్ల, భవనాల శాఖ అధికారులకు ఎంపీ సూచించారు. రైల్వే బ్రిడ్జి వేయడం వల్ల క్రాసింగ్ లెవెల్ లేకపోవడం వలన వరద నీరు బయటికి వెళ్లలేక పోతుందని వార్డు ప్రజలు ఎంపీకి వెల్లడించారు. రైల్వే బ్రిడ్జి పక్కన 150 ఎకరాల రైతులకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. ఫతేపూర్ రైల్వే బ్రిడ్జిని ఎంపీ పరిశీలించి అక్కడ ఉన్న వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని నీటిని నాలాల వెంట పంపాలని నీ ఎంపీ అధికారులకు సూచించారు. ఎంపీని రావులపల్లి గ్రామస్తులు సన్మానించారు.

కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, మున్సిపల్ ఇన్చార్జి వాసుదేవ్ కన్నా, మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, 8వ వార్డు కౌన్సిలర్ రాములు, మాజీ ఎంపీపీ నర్సింలు, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, పండిత్ రావు, మండల, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS