డ్రైనేజ్ పై శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు
-యదేచ్చగా సాగుతున్న అనధికార నిర్మాణాలు
-నిద్రావస్థలో పంచాయతి కార్యదర్శి
రాజమహేంద్రవరం,
బొమ్మూరు గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ఆటకెక్కాయి. అనుమతులు లేని నిర్మాణాలు, డ్రెయిన్ పై శాశ్వత నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమయమౌతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పంచాయతి పరిధిలోకి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బాలాజీ పేట సెంటర్ నుండి బొమ్మురు సెంటర్ వరకు డ్రైనేజ్ పై శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేయటంతో పూడికలు చేపట్టేందుకు వీలులేక ఎక్కడి చెత్త అక్కడే పూడిపోయి ఉండటంతో చిన్నపాటి వర్షానికే బాలజీపేట వీధులన్ని జాలమయమౌతున్నాయి. దీంతోపాటు అనధికార నిర్మాణాలు చేపట్టినప్పటికీ పంచాయతీ అధికారి నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికితోడు షాపుల యజమానులు మురుగు కాల్వలపై శ్లాబులు వేసి ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నా రు.
డ్రైనేజ్ పై శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు
Related Posts
డిఆర్ఓ గా మురళి
TEJA NEWS సాక్షిత న్యూస్ : పల్నాడు జిల్లా డిఆర్ఓ గా మురళి పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి గా మంగళవారం మురళి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నరసరావుపేటకు వదిలి అయ్యారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్…
పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు
TEJA NEWS పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు పైడివాడ అగ్రహారం గ్రామ రెవిన్యూ పరిధిలో ఈరోజు రీ- సర్వే మరియు ఇతర భూ సమస్యల పరిష్కారం కొరకై గ్రామసభ నిర్వహించారు. ఈ రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం…