బాధితులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేత
సిద్దిపేట జిల్లా
జగదేవపూర్ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రాగుల కనకయ్య, పీ నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పటల్ చేరారు హాస్పటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగా మండల టి ఆర్ ఎస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే స్పందించి మాజీ మంత్రి హరీష్ రావు.ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,రాష్ట మాజీ ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి సహకారంతో
సిఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేయగా
సీఎం రిలీప్ ఫండ్ నుంచి రాగుల కనకయ్య కు ₹ 60,000/- రూపాయలు.
పి ,నర్సింలు కు ₹ 43,500/- రూపాయలు మంజూరు అయ్యాయి మంజూరు అయిన చెక్కులను మండల టి ఆర్ ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా టి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం లో సీఎం పని రిలీఫ్ అప్లై చేసిన వెంటనే నెలరోజుల లోపు సీఎం ఫండ్ రిలీఫ్ మంజూరు అయ్యేది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి,టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య, గణేష్,భాస్కర్,మల్లేశం,మహేష్,సత్యం,భాస్కర్,శ్రీను,అలిమ్,బాబు, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు