గురు. జూలై 18th, 2024

గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన కార్పొరేటర్

TEJA NEWS

*గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల చాకలి చెరువులో పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎంటమలజీ AE కిరణ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..గుర్రపు డెక్క పెరగడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. దోమల నివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు గుర్రపుడెక్క తొలిగింపు పనులను నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ పేర్కొన్నారు. దోమలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు గాను లార్వా దశలోనే నిర్మూలించేందుకు చెరువులో స్ప్రే చేయిస్తున్నామని అన్నారు. స్థానిక వాసులు పరిసర ప్రాంతలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు అని సూచించారు. కార్పొరేటర్ ఎంటమాలజీ అధికారులతో చర్చించి దోమల బారిన ప్రజలు చాలా ఇబ్బందులను పడుతున్నారని, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నందున త్వరితగతిన గుర్రపు డెక్క ను తొలగించమని ఆదేశించగా వారు స్పందించి పనులు ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో GHMC ఎంటమాలజీ ఏఈ కిరణ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన   కార్పొరేటర్
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page