వైయస్సార్ పాలనా స్మృతులు చెక్కు చెదరనివి
-దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కు ఘన నివాళి
-రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ కు జోహార్లు
-వైయస్సార్ ఆశయ సాధనకు కృషి
చేయడమే మనమిచ్చే ఘన నివాళి
-సంక్షేమ ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైయస్సార్
-రౌతు సూర్య ప్రకాశరావు,
డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మేడపాటి షర్మిల రెడ్డి
రాజమహేంద్రవరం :
ఎన్నేళ్లయినా డాక్టర్ వైయస్సార్ పాలనా స్మృతులు చెక్కు చెదరని, దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్డు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..సంక్షేమ, ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన పాలన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముందుగా మాట్లాడుతూ వైయస్సార్ జ్ఞాపకాలు చెక్కుచెదరలేదని, చేవెళ్లలో మొదలుపెట్టిన పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమ, ఆరోగ్య ప్రదాతగా చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచారన్నారు. గుండె ఆపరేషన్ల ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపకల్పన చేసి జనం గుండెల్లో
చిరస్తాయిగా నిలిచిపోయారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు. సాంకేతిక కొన్ని
వ్యవస్థాపక లోపాల వల్ల మాత్రమే అధికారం కోల్పోయామని, తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం కోసం జగన్ కు మనమంతా అండగా నిలవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఉంటారు అధికారంలో లేని కష్టకాలంలోనే నిజమైన కార్యకర్తలు నాయకులు బయట పడతారని వారే నిజమైన నాయకులు కార్యకర్తలని, పార్టీని మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీని పూర్వ
వైభవానికి మనమంతా కృషి చేయాలని అన్నారు. రెండు నిమిషాలు పాటించి డాక్టర్ వైఎస్ఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు.
ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నత చదువులు అందించిన ఘనత వైయస్సార్ కే దక్కుతుంది …
_రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు
చదువే సామాజిక అభివృద్ధికి మూలమని గ్రహించి పిల్లలు మంచి చదువు అభ్యసిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని, ఆ కుటుంబం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజం అభివృద్ధి చెందితే తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని విప్లవాత్మకమైన ఆలోచన చేసి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను ప్రసాదించారని రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ గాని అటు పెన్షన్ పంపిణీ గానీ ఆరోగ్యం కోసం గానీ వివిధ పథకాలు అమలు చేసి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేసి ఆదర్శవంతంగా నిలిచారన్నారు. పేదల కంట కన్నీరు రాకూడదని కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలన్నారు. రాజకీయ రంగంలో ఉన్న మనమంతా పేదల కన్నీళ్లు తుడిచే విధంగా కృషి చేసినప్పుడే ఘనమైన నివాళి అర్పించినట్టున్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడు …,
_ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి
ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు సాగించి ఆదర్శవంతమైన పాలన అందించిన స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణజన్ముడని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు. పేదరికం కారణంగా ఈ సమాజంలో ఎవరూ నష్టపోకూడదు అని ఆలోచన చేసి ఫీజు రీమార్చ్మెంట్ గాని ఆరోగ్యశ్రీ గాని తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారన్నారు. మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లాంటివారు ఉన్నత విద్యను సాగించామని చెప్పడం నిజంగా గర్వించదగ్గ అంశం అన్నారు. రచ్చబండ కు వెళుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనను తట్టుకోలేక ఎంతోమంది గుండె పగిలి చనిపోయిన ఉదంతాలు మన కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ ఆశీస్సులతో పార్టీ మరింత బలోపేతంగా అధికారంలోకి వస్తుందన్నారు. డాక్టర్ వైయస్ఆర్ కు జోహార్ నేర్పించారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ కుమార్, వైయస్సార్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక , మాజీ కార్పొరేటర్లు బురిడి త్రిమూర్తులు, అనిల్, స్వరూప్, నాయకులు స్వరూప్, జంగం సుబ్బారావు, విజయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. నాయకులు వంకాయల సత్తిబాబు, బాల శ్రీధర్, సుంకర అంజి బాబు, దాసరి సాంబశివరావు, ప్రసాద్, అన్నపూర్ణ రాజు, గుత్తుల భాస్కర్, మార్గాని బుజ్జి, గౌస్, మాస్టర్ శ్రీనివాసరావు , రామకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కోటగుమ్మం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.