ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది

ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది

TEJA NEWS

ఏ మునిసిపల్ కార్పొరేషన్ లేని విధంగా మాకు ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది.. మాకు సమస్య వచ్చినపుడల్లా అండగా నిలిచారు, వారికే మా మద్దతు – కార్మిక సోదరులు

నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించాము.. భవిష్యత్తులోనూ మీకు అండగా ఉంటాము.. ఊరు అభివృద్ధి చెందింది అంటే ఆశీర్వదించండి.. తిరుపతిని అగ్రస్థానంలో నిలపడమే నా లక్ష్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు.

యూడిఎస్ కార్మికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

తిరుపతి నగరాన్ని పరిశుభ్రం గా ఉందంటే మీరు చేస్తున్న కష్టం, తిరుపతి స్మార్ట్ సిటీ గా ర్యాంకులు సాధిస్తోంది అంటే మీరే కారణం, భవిష్యత్తులో పారిశుద్యం విషయంలో మరిన్ని బృహత్తర ప్రణాళికలు రుపొందిస్తున్నాము, శానిటేషన్ వర్కర్లను సెగ్రిగెట్ చేస్తూ ఎక్కువగా పెంచడం వలన మీకు పని ఒత్తిడి తగ్గి శుభ్రత విషయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు, పారిశుద్యం లో ఇండోర్ నగరాన్ని అధిగమించి తిరుపతిని మొదటి స్థానంలో నిలబెట్టాలనేది నా లక్ష్యం.

కార్మికులకు ఏ సమస్య వచ్చిన నేను అండగా వుంటాను.

తిరుపతి అభివృద్ధి లో భాగంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, కూడళ్ల సుందరీకర చేసాము.

భవిష్యత్తులో తిరుపతికి ఐటి ఇండస్ట్రీ తీసుకొచ్చేలా విశాలమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాము, మిడ్ సైజ్ ఐటి కంపెనీ లతో చర్చించాము, వారికీ అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాము.

అంతేకాకుండా తిరుపతిని నేరరహిత నగరంగా మార్చడంలో భాగంగా ఐఓటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి 4000సిసి కెమెరాలు అమర్చి నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తానని మాట ఇస్తున్నాను.

డిప్యూటీ మేయర్ గా నగరాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లతో రూపురేఖలు మార్చగలిగా, అభివ్రుది మీకళ్ళకి కనబడుతోంది.

ఊరు మారింది అని నమ్మితేనే మీరు మీ శ్రేయోభిలాషులకు చెప్పి ఫ్యాన్ గుర్తపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..

Print Friendly, PDF & Email

TEJA NEWS