మత సామరస్యానికి ప్రతీక వనపర్తి…….
వినాయక చవితిలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు….. జిల్లాఎస్పీ గిరిధర్ రావు
వనపర్తి
మత సామరస్యానికి ప్రతీక వనపర్తి జిల్లా అని ఇక్కడి ప్రజలు ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ అన్ని మతాల పండుగలను సోదర భావంతో ఐక్యమత్యంతో భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకోవడం వనపర్తి ప్రజల ఆనవాయితీ అని వనపర్తి జిల్లా ఎస్.పి గిరిధర్ రావు పేర్కొన్నారు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సెప్టెంబర్ 7న మొదలై 16,17 తేదీన శోభాయాత్రతో ముగుస్తుందని మరి అదే రోజున ముస్లిం పండగ మిలాన్ నబి పండగ వస్తుందని ఈ పండుగ ల సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసుల నిబంధనల ప్రకారం శాంతియుతంగా జరుపుకోవాలని
నిబంధన లు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తూ మట్టితో తయారుచేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు విగ్రహాల నిర్వాహకులు విగ్రహాల పూర్తి సమాచారాన్ని పోలీసులు ఏర్పాటుచేసిన ఆన్లైన్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వ శాఖల మున్సిపాలిటీ విద్యుత్ శాఖ మత్స్యశాఖ ఎక్సైజ్ పోలీస్ తదితర శాఖల సేవలను వినియోగించుకోవాలని విగ్రహా లు ఏర్పాటు చేసిన రోజు నుంచి మండపాలలో తగు జాగ్రత్తలను పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా భక్తిశ్రద్ధలతో బాధ్యతాయుతంగా
శాంతియుతంగా పండగలను జరుపుకోవాలని అలాగే మండపాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అనవసరమైన సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు సింగిల్ ఫేస్ డీజే లను ఏర్పాటు చేసుకోవాలని సాంప్రదాయబద్ధమైన లలిత కళలతో కూడుకున్న భజనలు కోలాటాలు నాటికలు నాటకాలు యక్షగానాలు తదితర కలల ప్రదర్శన ల తో సంతోషంగా జరుపుకోవాలని ఇండ్ల వద్ద చిన్నపిల్లలు అనారోగ్యం తో బాధపడుతున్న పెద్దలు ఉంటారని రాత్రి 10 గంటల లోపు ముగించుకోవాలని వినాయక చవితి సందర్భంగా మండపాలకుసీఎం ప్రకటించిన ఉచిత కరెంటు పై తమకు గైడ్లైన్స్ ఇంకా రాలేదని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని ఏఈ శ్రీనివాసులు తెలపడం విశేషం మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ఎలాంటి ఇబ్బందులు కలిగిన 100కు కాల్ చేయాలని ఆయన సూచించారు ఇతర వ్యక్తులకు ముతస్తులకు ఇబ్బందులు కలిగించకుండా సభ్యత సంస్కారం కనీస బాధ్యతతో వ్యవహరించాలని కోరారు
శోభయాత్ర సమయంలో చర్చి మసీదులు పాఠశాలల వద్ద ఆకతాయి యువకులు ఈలలు కేకలు వేయకూడదన నిర్వాహకులు బాధ్యత వహించాలని తెలిపారు