విశాఖ పోలీసులు చోరీ కేసును పోలీసులు ఛేదించారు…
విశాఖ నగరం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ హెచ్ కాలనీలో గత ఏడాది జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది ముగ్గురు నిందితులుగా పీఎం పాలెం పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ కాగా..ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిలో కరుణ కుమార్ అనే 19 ఏళ్ల వ్యక్తిని పీఎం పాలెం పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి నుంచి 18 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మధురవాడ ప్రాంతంలో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెంకటరత్నం తెలిపారు. దొంగతనాలు హత్యలు ఎక్కువగా జరుగుతున్న నివాస సముదాయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని… వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానించడం ద్వారా నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని డిసిపి వెంకట రత్నం ప్రజలకు విజ్ఞప్తి చేశారు..