TEJA NEWS

వీఆర్వోలకు సముచిత స్థానం కల్పించాలి
-తాసిల్దారులను డిడిఓ లగా నియమించాలి
-వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

రాజమహేంద్రవరం,

గ్రేడ్-I, గ్రేడ్-II గ్రామ రెవిన్యూ అధికారులకు తాసిల్దార్లను డీడీవోగా నియమించి,
బదిలీల విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలని జిల్లా వీఆర్వోల సంఘం మండల అధ్యక్ష కార్యదర్సుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కూచిమంచి సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సొంగా రాజు పేర్కొన్నారు. స్థానిక పిడింగొయ్యి సచివాలయం 4లో ఏర్పాటుచేసిన అధ్యక్ష కార్యదర్శులు సమావేశములో వారు మాట్లాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పునర్మిర్మాణంలో వీఆర్వోలకు సముచిత స్థానం కల్పించాలని, వీఆర్వోలు తమ ఎటెండెన్స్ ఒక్క ఏపీ.ఎఫ్.ఆర్.ఎస్ నందే నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. వీఆర్వోలకె రేవెన్యూ విధులు కాకుండా ఇతర శాఖల పనులు అప్పగించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసే విధంగా ఉన్నతాధికారులను కోరాలని సూచించారు.
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నంబర్ మంగ అప్పల నాయుడు, జిల్లా ట్రెజరర్ ర్యాలీ నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మహ్మద్ రాజా, జిల్లా ఉపాధ్యక్షులు కె. రామారావు, జిల్లా గౌరవ అద్యక్షులు ఎం. ప్రకాష్, కొవ్వూరు డివిజన్ సెక్రెటరీ ఎం మధు, రాజమహేంద్రవరం డివిజన్ ప్రెసిడెంట్ ఏ. శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆదినారాయణ, జిల్లా నలుమూలల నుండి వచ్చిన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS