TEJA NEWS

వందరోజుల కూటమి ప్రభుత్వం…ప్రజలకు చేసింది ఏమిటి..??
సూటిగా ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్.


విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్ రావు బాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూకబ్జాలకు పాల్పడుతు, ప్రభుత్వ భూములను మాయం చేసే దిశగా శంకర్ రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అదీప్ రాజ్ అధికారులను కోరారు. సర్వే నెంబర్ 113లో జరుగుతున్న అన్యాక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే బక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల రూపాయలు విలువచేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా షెడ్స్ నిర్మిస్తూ ఇష్టారాజ్యంగా పన్నులు పొందడం అధికార దుర్వినియోగమని స్పష్టం చేశారు . అందుకు జీవీఎంసీ వారు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు మాయం చేస్తూ ఆక్రమణలకు గురవుతున్న స్థలాలకు ఇంటి పన్ను, కరెంట్ మీటర్ ఎలా ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. వందరోజుల్లోనే ఇంతటి అక్రమాలకు పాల్పడితే రానున్న 5సంవత్సరాల్లో ఎలాంటి భూదోపిడీలకు పాల్పడతారో అన్న విషయం ఉహకందటం లేదని దుయ్యపట్టారు.సమావేశంలో 95 వ వార్డు కార్పొరేటర్ ఎమ్.దేముడు, 97 వ వార్డ్ వైసీపీ నాయకులు ఎమ్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS