ఏలూరు రేంజ్ లో ఉన్న ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాజిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా మరియు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎస్పీలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ఐపీఎస్.,
ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధన పై అవగాహన కల్పించాం.
ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా అక్రమ వినియోగం గంజాయి నివారణపై ఎక్కువ ఫోకస్ పెట్టాం.
ATF(యాంటీ టాస్క్ ఫోర్స్) టీం లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతాం.
మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం.
కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్ ఇచ్చేందుకు కృషి చేస్తాం.
పోలీసులు పౌరులకు మెరుగైన సేవలందించి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి అని రాష్ట్ర డి.జి.పి. ద్వారకా తిరుమలరావు ఐపిఎస్., .
రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ఐపీఎస్., ఏలూరు రేంజ్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ లో ఏలూరు రేంజ్ జిల్లాల ఎస్పీ లతో ఈ రోజు అనగా 18.09.2024 వ తేది నాడు క్రైం రివ్యూ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజిపి ఏలూరు రేంజ్ లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగింది అని,
సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన ఆన్ని వనరులు సరిగా లేవు. వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయి త్వరలో వాహనాలు సమకూరుస్తాం.
చిన్న చిన్న సర్వీస్ మేటర్ ల విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటాం. సంక్షేమ విషయము లలో సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని.
క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. పోలీస్ సిబ్బందితోపాటు ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలి.
సిబ్బంది యొక్క కొరతను అధిగమించుట కొరకు త్వరలో పోలీసులను రిక్రూట్ చేస్తాం, కొంత టైం పడుతుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుట వలన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు డిజిటల్ విధానం ద్వారా ఎక్కువ లావాదేవులు చేస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సైబర్ నేరాల నివారణ కొరకు పటిష్టమైనటువంటి చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నట్లు
ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. మానవ హక్కులను గౌరవిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు.
ప్రస్తుతం గంజాయి మీద 100 రోజులు ప్రణాళిక రూపొందించాం. గంజాయి మాదకద్రవ్యాల పై ప్రజలకు, చిన్న పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి.
ప్రతి జిల్లాల్లో ఉన్న సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నాం.
మహిళలు మరియు మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని,
పోలీసు డిపార్ట్మెంట్ లో వాహనాలు పాతబడ్డాయి. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుంది అని,
గంజాయి, మాదకద్రవ్యాల పై ప్రజలకు అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో ఉన్న అన్ని స్కూళ్లు కాలేజీలు వద్ద విద్యార్థిని విద్యార్థులకు గంజాయి వలన కలిగే అనర్ధాలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,
పోలీసులు నైపుణ్యాలను పెంపోందించుకుని, పనితీరును మెరుగు పరుచుకోవాలి అని,
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను విజయవాడ మరియు విశాఖపట్నంలోనే ఉన్నాయని సదరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం కొరకు ముఖ్యమంత్రి కు వారికి తెలియ పరచగా వారు అంగీకరించినారని, త్వరలోనే సైబర్ పోలీస్ స్టేషన్లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.