TEJA NEWS

నష్టపోయిన ప్రతీ ఇంటికి సాయం
ఎవరూ అధైర్య పడొద్దు
ఖమ్మం రూరల్, నేలకొండపల్లి పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి ఖమ్మం
ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, నష్టపోయిన ప్రతీ ఇంటికి సాయం అందిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం గ్రామాల్లో, నేలకొండపల్లి మండలంలోని చెరువుమదారం, కట్టుకాచారం రామచంద్రాపురం, సుర్దేపల్లి గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. రహదారుల మరమ్మత్తులు, తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణ పై అధికారులకు తగు సూచనలు చేశారు. అధికారులు సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టి, పూర్తి చేయాలన్నారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి తగు న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో జి. గణేష్, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, మునిసిపల్ డిఇ ధరణి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Print Friendly, PDF & Email

TEJA NEWS