TEJA NEWS

బురదమయంగా మారిన శంకర్ పల్లి రిత్విక్ కాలనీ రోడ్లు….

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రిత్విక్ వెంచర్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయంగా మారాయి. బుడదలో కాలనీవాసులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో 65 ఇండ్లు ఉన్నాయి. అందులో సుమారు 250 మంది ప్రజలు నివసిస్తున్నారు ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు పన్నుల రూపంలో స్థానిక మున్సిపల్ కార్యాలయానికి అందుతున్నాయి. ఈ కాలనీ ఏర్పడి సుమారు 14 సంవత్సరాల అయింది. ఆనాటి నుండి ఈనాడు వరకు కాలనీవాసులు సరైన రోడ్లు లేక కురిసిన వర్షానికి బుడదయంగా మారడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు అప్పటి గ్రామ పంచాయతీ అధికారులకు కాలిని రోడ్ల విషయం వివరించిన ఫలితం లేకుండా పోయిందని కాలినివాసులు వాపోతున్నారు. కాగా రెండు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు స్మశాన వాటిక రోడ్డు ద్వారా కాలనీకి వచ్చే రోడ్డు ఒక ప్రక్క కూలిపోయింది. ఆనాటి నుండి ఈ బ్రిడ్జి పనులు చేపట్టాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు, నాయకులకు విన్నవిస్తూనే ఉన్నారు. స్మశాన వాటిక రోడ్డు కూడా బురదమయంగా మారింది. గొల్లవాగుపై నిర్మించిన కల్వర్టు ఒక పక్క కూలిపోయినందున మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ వ్యవసాయ మార్కెట్ కు చెందిన ప్రహరీ గోడను తొలగించి వాహనాలు పెరగడానికి సౌకర్యం కల్పించారు. కాగా ఈనెల రెండవ తేదీన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తన సిబ్బందితో కాలనీకి వచ్చే కల్వర్టును, రోడ్లను పరిశీలించారు. త్వరలో బురదమైన రోడ్లపై మొరం పోయిస్తానని కాలనీవాసులకు తెలపడం జరిగింది. వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టి కాలనీలో ఉన్న బురద రోడ్లపై మొరం పోయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS