జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ హాస్టల్స్ ను తెరిపించాలి
హాస్టల్స్ మూతపడడానికి కారణమైన వార్డెన్ ల పైన చర్యలు తీసుకోవాలి
( ఎస్ ఎఫ్ ఐ)సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్
సిద్దిపేట్ జిల్లా:
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ హాస్టల్స్ ను తిరిగి ప్రారంభించాలని భారత విద్యార్ది ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ) సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి దాసరి ప్రశాంత్ డిమాండ్ చేశారు
స్థానిక చేర్యాల మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ గతంలో మూత పడి బిసి హాస్టల్ కి షిఫ్ట్ అయ్యిందని బిసి హాస్టల్ భవనం లో ఎస్సీ హాస్టల్ ప్రస్తుతం నడుస్తుంది అని ఎస్సీ హాస్టల్ కి సంబంధించిన స్థలంలో గతంలో మూతపడ్డ ఎస్సీ విద్యార్ధునుల హాస్టల్ ఏర్పాటు చేయాలని , నూతనంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటుకు చేర్యాల లో అవకాశం ఉందని కానీ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని అలాగే మద్దూర్ లో ఎస్సీ బీసీ హాస్టల్స్ విద్యార్థులు లేరనే సాకుతో మూసి వేశారని కావున తిరిగి తెరిపించాలని డిమాండ్ చేశారు దుల్మిట్ట లో ఉండే ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు దగ్గరగా ఉందని మూసి వేసారని హాస్టల్స్ మూసివేయడానికి తెర వెనుక హాస్టల్ వార్డెన్ ల ప్రమేయం ఉందని ఎక్కువ మంది విద్యార్ధులు ఉంటే అధిక డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశలో వార్డెన్ లు ఉన్నారని వారిపైన చర్యలు తీసుకోవాలి ఉన్నత అధికారులు స్పందించి మూసివేసిన హాస్టల్ లని తెరిపించే వరకు( ఎస్ ఎఫ్ ఐ )పోరాటం ఆగదని అన్నారు ఈ కార్యక్రమంలో ( ఎస్ ఎఫ్ ఐ )చేర్యాల డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ డివిజన్ నాయకులు అరవింద్ మధు తదితరులు పాల్గొన్నారు